![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -550 లో... కావేరి, స్వప్న ఇద్దరు శ్రీధర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని బాధపడుతారు. కాసేపటికి కాంచనకి కావేరి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకని కాంచన చెప్తుంది. నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళావా అక్క అని కావేరి అనగానే.. అంటే నేను వెళ్లాలని అనుకుంటున్నావా అని కాంచన అంటుంది. అంటే ఆయనకి నా కన్నా మీరే ఎక్కువ ఇష్టమని కావేరి అంటుంది. కావేరి మాటలు కాంచనని బాధపెడుతాయి. ఆ తర్వాత ఎందుకు అమ్మ పెద్దమ్మతో అలా మాట్లాడావని స్వప్న అంటుంది.
మరొకవైపు డాక్టర్ సుమిత్ర గురించి పాజిటివ్ గా చెప్పారు.. రెండు రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు.. వెళ్లి సుమిత్రకి ఏం కావాలో చూడమని దీపతో దశరథ్ చెప్పగానే దీప వెళ్తుంది. నాకు మా నాన్న కన్నా అత్తకి ఏమైందోనన్న టెన్షన్ ఎక్కువగా ఉందని కార్తీక్ అంటాడు. నిజం చెప్పండి మావయ్య అని దశరథ్ ని కార్తీక్ అడుగుతాడు. దాంతో నాకు భయంగానే ఉంది.. రిపోర్ట్స్ వస్తే చెప్తానన్నాడు మేజర్ ప్రాబ్లమ్ అయి ఉంటుందన్నాడని దశరథ్ చెప్తాడు. ఈ విషయం దీపకి తెలియొద్దు అనుకుంటారు. కార్తీక్ బయటకు వస్తుంటే దీప వింటుంది. నేను అంతా విన్నాను బావ అని అనగానే అత్తకి ఏం కాదని దీపకి ధైర్యం చెప్తాడు కార్తీక్.
మరొకవైపు శౌర్య దగ్గరికి కాంచన వస్తుంది. మీ తాత స్టేషన్ లో ఉన్నాడు.. మీ నాన్న వస్తే వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. దీప క్యారేజ్ రెడీ చెయ్ మీ మావయ్య గారికి తీసుకొని వెళ్ళాలని కాంచన అంటుంది. ఆ తర్వాత కాంచనని తీసుకొని స్టేషన్ కి వెళ్తాడు కార్తీక్. కాంచన రావడంతో శ్రీధర్ హ్యాపీగా భోజనం చేస్తాడు. అమ్మనాన్న మాట్లాడుకుంటారు. మధ్యలో నేను ఎందుకని కార్తీక్ బయటకు వెళ్తాడు. నన్ను భర్తగా ఒప్పుకొని.. నా కోసం వచ్చావని శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను అంగీకరించానని మీకెవరు చెప్పారని కాంచన అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. భోజనం తినడం ఆపేస్తాడు. కార్తీక్ అది విని లోపలికి వస్తాడు. కార్తీక్ వచ్చి భోజనం తినిపిస్తుంటే వద్దని అంటాడు. అమ్మ, మీరు ఎప్పటిలాగే ఉండొచ్చు కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |